విషవాయువు అరికట్టేందుకు గుజరాత్ నుండి ప్రత్యేక రసాయనం

విషవాయువు అరికట్టేందుకు ప్రత్యేక రసాయనం తో గుజరాత్ నుండి విశాఖ వచ్చిన కార్గో విమానం


సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు కొనసాగుతున్న చర్యలు


11కు చేరిన మృతుల సంఖ్య..


 


విశాఖపట్నం:  విశాఖ ఎల్జి పాలిమర్స్ లో తలెత్తిన గ్యాస్ లీకేజ్ అరికట్టేందుకు గుజరాత్ నుండి ప్రత్యేక రసాయనాలు కార్గో విమానంలో తరలించారు.  ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజి వల్ల తలెత్తిన పరిణామాలను అదుపులోకి తీసుకొచ్చి తదుపరి నష్టాన్ని నివారించడానికి గుజరాత్‌ నుంచి అత్యవసర ప్రాతిపదికన ప్రత్యేక రసాయనాన్ని తరలించి దానిద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.‘పారా టెర్షియరీ బ్యుటైల్‌ కెటెహాల్‌’ (పీటీబీసీ) అనే ఈ రసాయనాన్ని గుజరాత్‌లోని వ్యాపి పట్టణంలోనే ఉత్పత్తి చేస్తారు.


లీకైన గ్యాస్‌ ప్రభావం లేకుండా చేయడానికి విశాఖలో కొంతవరకు వినియోగించారు. మరింతగా పీటీబీసీ రసాయనం పంపించాలని ఎల్జీ పాలీమర్స్‌ అభ్యర్థించడంతో విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లగా.. విమానంలో తరలింపునకు ఆయన తక్షణమే అధికారులను ఆదేశించారని ఆ శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి దిల్లీలో తెలిపారు. 500 కిలోల రసాయనాన్ని వ్యాపి నుంచి దమణ్‌కు రోడ్డు మార్గాన, అక్కడి నుంచి విశాఖకు వాయు మార్గాన తరలించినట్లు వివరించారు. కాగా ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల్లోని పరిస్థితులను మెరుగుపరిచేందుకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు అన్ని విధాలా బాధితులను ఆదుకుంటుంది.


11కు చేరిన మృతుల సంఖ్య


విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో సంభవించిన గ్యాస్ లీకేజీతో ఐదు గ్రామాల ప్రజలు విలవిలలాడిన ఘటనలో విషవాయువుల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11కు చేరింది ఈ ఘటనలో కొంతమంది కోల్పోగా ఆస్పత్రిలో 193 మంది చికిత్స పొందుతున్నారు ఒకేసారి అధిక సంఖ్యలో ప్రజలు అపస్మారక స్థితిలో చేరడంతో తల్లి పిల్ల వేరువేరుగా చికిత్స పొందుతూ ఒకరి కోసం ఒకరు ఎలా ఉన్నారు ఎక్కడున్నారు అని ఆందోళన చెందుతున్నారు కాగా మృతి చెందిన వారు వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పేందుకు వెనకాడుతున్నారు చికిత్సపొందుతున్న తల్లికి కుమార్తె మరణ వార్త ఏ ప్రమాదం ముంచుకొస్తోంది ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది ఇటువంటి పరిణామాలు కన్నీరు పెట్టిస్తున్న పరిస్థితి నెలకొంది త్వరలోనే సాధారణ వాతావరణ పరిస్థితి రావాలని ఆశిద్దాం.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా