ఏపీలో రెండు వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో 2000 దగ్గరగా దేశవ్యాప్తంగా 60 వేలకు చేరువలో కరోనా కేసులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి దేశంలోనే అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రథమ స్థానంలో నిలవగా పరీక్షలకు దీటుగా రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి ఎక్కడికక్కడ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకుంటే మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు ఓ పక్క ప్రభుత్వం విస్తృతంగా కరుణ కట్టడికి ప్రయత్నం చేస్తూనే ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ప్రయత్నం ముమ్మరం చేసింది ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరికి వారు సామాజిక భద్రత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేలకు చేరువలోను, దేశంలో 60 వేలకు దగ్గరలో (59,662)పాజిటివ్ కేసులు చేరుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 43 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 1930 , వైద్య సేవలు పొందుతున్న వారు 999 , డిశ్చార్జ్ అయిన వారు 887 , మరణించిన వారు 44.
గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు - 8,388 , మొత్తం ఇప్పటి వరకు చేసినవి 1,65,069 వాటిలో పోసిటివ్ కేసులు 1930 (1.17 %) మరణాలు 44 (2.28 %)
జిల్లాల వారీగా :
అనంతపురం : కొత్త కేసులు 3 , మొత్తం 102 , చికిత్స పొందుతున్న వారు 54 , డిశ్చార్జి అయిన వారు 44 , మరణించిన వారు 4.
చిత్తూరు : కొత్త కేసులు 11 , మొత్తం 96 , చికిత్స పొందుతున్న వారు 22 , డిశ్చార్జి అయిన వారు 74 , మరణించిన వారు లేరు.
తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు , మొత్తం 46 , చికిత్స పొందుతున్న వారు 17 , డిశ్చార్జి అయిన వారు 29 , మరణించిన వారు లేరు.
గుంటూరు : కొత్త కేసులు 2 , మొత్తం 376 , చికిత్స పొందుతున్న వారు 200 , డిశ్చార్జి అయిన వారు 168 , మరణించిన వారు 8.
వైఏస్సార్ కడప : కొత్త కేసులు లేవు , మొత్తం 96 , చికిత్స పొందుతున్న వారు 53 , డిశ్చార్జి అయిన వారు 43 , మరణించిన వారు లేరు.
కృష్ణ : కొత్త కేసులు 16 , మొత్తం 338 , చికిత్స పొందుతున్న వారు 191 , డిశ్చార్జి అయిన వారు 134 , మరణించిన వారు 13.
కర్నూలు: కొత్త కేసులు 6 , మొత్తం 553 , చికిత్స పొందుతున్న వారు 320 , డిశ్చార్జి అయిన వారు 218 , మరణించిన వారు 15.
నెల్లూరు : కొత్త కేసులు లేవు , మొత్తం 96 , చికిత్స పొందుతున్న వారు 32 , డిశ్చార్జి అయిన వారు 61 , మరణించిన వారు 3.
ప్రకాశం : కొత్త కేసులు లేవు , మొత్తం 61, చికిత్స పొందుతున్న వారు 1 , డిశ్చార్జి అయిన వారు 60 , మరణించిన వారు లేరు.
శ్రీకాకుళం: కొత్త కేసులు లేవు , మొత్తం 5 చికిత్స పొందుతున్న వారు 5 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు.
విశాఖపట్నం : కొత్త కేసులు 5 , మొత్తం 62 , చికిత్స పొందుతున్న వారు 38 , డిశ్చార్జి అయిన వారు 23 , మరణించిన వారు 1 .
విజయనగరం - కొత్త కేసులు లేవు , మొత్తం 4 , చికిత్స పొందుతున్న వారు 4 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు.
పశ్చిమ గోదావరి: కొత్త కేసులు లేవు, మొత్తం 68 , చికిత్స పొందుతున్న వారు 35 , డిశ్చార్జి అయిన వారు 33 , మరణించిన వారు లేరు.
Comments
Post a Comment