విశాఖ ఘటనపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ :దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విశాఖ విషవాయు ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు కొద్దిసేపటి క్రితం ఉన్నత స్థాయి అధికారులతో న్యూఢిల్లీలో సమావేశమై సమీక్షించిన ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గ్యాస్ లీకేజీ దానికి కారణాలు భవిష్యత్ కార్యాచరణ ఘటన తో అస్వస్థతకు గురైన వారి భవిష్యత్ ఆరోగ్య పరిణామాలు కంపెనీ చేపట్టే రక్షణ చర్యలు తదితర అంశాలపై కమిటీ సమగ్ర విచారణ జరపనుంది.
కాగా విశాఖలో విషవాయువు బారినపడిన బాధితులను ఆదుకోని సహాయక చర్యలు అందించేందుకు మరియు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బంది సహాయక చర్యల్లో పూర్తి సహకారం అందించి చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు ఈ ఘటన మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఫోన్ చేసి ఈ విషయం తెలుసుకొని ఎటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు
Comments
Post a Comment