విశాఖ ఎల్జి పాలిమర్స్ ప్రాంతంలో సాధారణ పరిస్థితి
డీజీపీ గౌతమ్ సవాంగ్
విశాఖపట్నం (జనహృదయం): విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు శనివారం ఉదయం ఆయన సంఘటన స్థలాన్ని, ఆ పరిసర గ్రామాలలో పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆయన కలియతిరిగి మాస్కులు లేకుండా గాలిని పరిశీలించారు అయితే ఆక్సిజన్ బాగా అందుతుంది అని ఎటువంటి ఇబ్బంది లేదని తాను స్వయంగా తెలుసుకోవడం జరిగిందని అన్నారు చుట్టుపక్కల వున్న ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అయితే ప్రమాద పరిసరాల్లో ఉన్న ఐదు గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో రేపటికి వచ్చేందుకు అవకాశం ఉందని అన్నారు
Comments
Post a Comment