విశాఖ ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
బాధితులు కోలుకునే వరకూ అన్ని విధాలా ఆదుకుంటాం సీఎం జగన్
పరిస్థితి చక్కబడే వరకు ప్రధాన కార్యదర్శి తో సహా మంత్రులు విశాఖలోనే సేవలు అందిస్తార
(విశాఖపట్నం – జనహృదయం ప్రతినిధి రాజన్)
విశాఖ ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా సీఎం జగన్ ప్రకటించారు విషవాయువు బారినపడి ఐదు గ్రామాలకు చెందిన 15వేల మందికి ఒక్కొక్కరికి 10 వేల వంతున ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్ విశాఖ కలెక్టర్ను ఆదేశించారు బాధితులను విశాఖ కేజీహెచ్లో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి దురదృష్టకర సంఘటనలు సంభవించడం తన హృదయాన్ని కలచి వేసిందని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
బాధితులందరికీ పూర్తిస్థాయిలో కోలుకునే వరకూ ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తూ వైద్య సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు తక్షణ సహాయం కింద ఐదు గ్రామాలకు చెందిన 15 వేల మంది జనాభాకు పదివేల వంతెన సహాయం ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల వంతున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూనే వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారికి 10 లక్షలు వంతెన ఆస్పత్రిలో రెండు మూడు రోజులు పాటు చికిత్స పొందుతున్న పొందినవారికి లక్ష రూపాయల వంతున ప్రాథమిక చికిత్స అవసరమైన వారికి 25000 వంతెన ఆర్థిక సహాయం ప్రకటించారు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు ఆయా గ్రామాల ప్రజలు గ్రామాలకు చేరుకునే వరకు సెంటర్లు ఏర్పాటు చేసి మంచి భోజన వసతి ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు
అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని మరియు కన్నబాబు నాని ధర్మాన కృష్ణ ప్రసాద్ స్థానికంగా ఉండి సహాయ కార్యక్రమాల్లో పాల్గోవాలని ఆదేశించారు
ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్ కార్యాచరణ పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని దీనికోసం జిల్లా ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు భవిష్యత్తులో ఆ ప్రాంతంలో కంపెనీ నిర్వహణపై సమీక్షిస్తామని సీఎం హామీ ఇచ్చారు సంఘటన అనంతరం అధికారులు స్పందించిన తీరు అభినందనీయమని అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ వెంకటాపురం ఘటనపై అధికార యంత్రాంగం స్పందించి సకాలంలో వైద్య సేవలు అందించిందని అలాగే కేంద్ర బృందాలు నేవీ ఎన్డీఆర్ఎఫ్ సేవలను సీఎం కొనియాడారు
మల్టీ నేషనల్ కంపెనీలో ఇటువంటి సంఘటనలు విచారకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని సీఎం పేర్కొన్నారు బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కంపెనీలో మృతుల కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగ అ అవకాశం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే పశు సంపద కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Post a Comment