ప్రాణనష్టం పెరక్కుండా సహాయక చర్యలు ముమ్మరం
కొద్దిసేపట్లో విశాఖ చేరుకున్న సీఎం
ఏ సహాయం అందించేందుకు అయినా సిద్ధం ప్రధాని మోడీ
పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు
ఎక్కడ చూసినా హృదయ విదారకరమైన దృశ్యాలు
వీధిలోనూ కాలువలోను అపస్మారక స్థితిలో పడిన దృశ్యాలు
(జనహృదయం – ప్రతినిధి రాజన్)
విశాఖపట్నం : విశాఖపట్నం నగర శివారులో విషవాయువుల సృష్టించిన భయానక పరిస్థితులు నుండి ప్రజలను సంరక్షించేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది ఏ ఒక్క ప్రాణం నష్టం జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులు అన్నిటినీ సిద్ధం చేసింది ఏ ఆస్పత్రికి ఈ వాయువు బారినపడి ఎవరు వచ్చినా వెంటనే అలక్ష్యం చేయకుండా వైద్యం చేస్తూ అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది తెల్లవారు మూడు గంటలకు అంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు సంభవించిన ఈ దుష్పరిణామం తో ఇప్పటికే 9 మంది మృతి చెందగా 246 మంది కి అత్యవసర చికిత్స అందిస్తున్నారు అలాగే 20 మంది కి వెంటిలేటర్పై శ్వాస అందిస్తున్నారు. శ్వాస అందక ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెడుతున్న వారు ఎక్కడపడితే అక్కడ అ పడిపోయి హృదయ విదారకమైన పరిస్థితులు పలువురిని కంటతడి పెట్టించాయి ఈ ఘటనలో మహిళలు చిన్న పిల్లలు అధికంగా అస్వస్థతకు గురయ్యారు వీధిలోనూ రోడ్లపైన అపస్మారక స్థితిలో పడిపోయిన వారిని ఆస్పత్రికి తరలించారు 25 నుండి 30 ద్వారా వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక మూగజీవాల విషయానికొస్తే కలుగులో దాక్కున్న ఎలుక సైతం విషవాయువు బారినపడి బయటకు వచ్చి గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచిన పరిస్థితి వందలాది పశువులు పక్షులు కుక్కలు విషవాయువు తో ప్రాణాలు విడిచాయు.
ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో ఉన్న ఐదు గ్రామాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో వ్యాప్తి చెందడంతో పరిస్థితి దయనీయంగా మారింది వెంకటాపురం గ్రామం లో తలుపులు మూసుకుని నిద్రిస్తున్న వారిని కాపాడేందుకు తెల్లవారు నుండి పోలీస్ సిబ్బంది తలుపులను బ్రద్దలు కొట్టే వారిని రక్షించారు కాగా రక్షణ చర్యలు అందించేందుకు వెళ్లినా పోలీస్ సిబ్బంది అంబులెన్స్ డ్రైవర్ తో పాటు పలువురు విషవాయువుల బారినపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు కొంతమంది మరికొందరు చికిత్స పొందుతున్నారు
విషవాయువు బారినపడి ఎక్కడ ఉన్న వారైనా ఏ ఆసుపత్రి కైనా వెళ్లి వైద్య సహాయం ఉండవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులను సైతం అలర్ట్ చేశారు
విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ సిపి ఆర్కె మీనా ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ప్రాణనష్టం జరగకుండా హుటాహుటిన ఆయా గ్రామాల్లో ప్రజలను ఆస్పత్రులకు తరలించారు మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు పంపారు తమ ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతంలో తలదాచుకుని ఉన్న మరికొందరికి అధికారులు అల్పాహారం భోజనం సమకూర్చుతున్నారు
విశాఖ లో నెలకొన్న ఈ భయానక పరిస్థితుల నుండి ప్రజలను కాపాడేందుకు ప్రధానమంత్రి నుండి ముఖ్యమంత్రి వరకు క్షణక్షణం స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిస్థితిని సమీక్షించి బాధితులను పరామర్శించేందుకు విశాఖ బయలుదేరారు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన మరికొద్ది సేపట్లో విశాఖ చేరుకున్నారు ఎటువంటి సహాయక చర్యలు అందించేందుకు అయినా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ సీఎం హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే బాధితులను పరామర్శించేందుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అధికార యంత్రాంగం తో పాటు స్థానిక బిజెపి టిడిపి వైఎస్ఆర్ సీపీ నాయకులు సహాయక చర్యల్లో పాల్గొని అధికార యంత్రాంగానికి చేదోడుగా నిలిచారు
Comments
Post a Comment