మరోసారి వార్తల్లోకెక్కిన నర్సీపట్నం డాక్టర్ సుదాకర్.. పోలిసుల అదుపులో...

 



విశాఖపట్నం (జనహృదయం):  సస్పెన్షన్కు గురైన ప్రభుత్వ వైద్యాధికారి మతిస్థిమితం కోల్పోయి పోలీసుల అదుపులో చేరిన ఉదంతం విశాఖలో జరిగింది ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి చెందిన డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ సుధాకర్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన తీరుకు వ్యతిరేకంగా వైద్యుల కమిటీ ఇటీవల సస్పెండ్ చేసింది దీంతో మనస్తాపానికి గురైన వైద్యాధికారి తనను అన్యాయంగా సస్పెండ్ చేశారు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ శనివారం సాయంత్రం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై బైఠాయించి మరోసారి వార్తల్లో నిలిచారు తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఈ మేరకు అక్కడున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సుధాకర్ ని బలవంతంగా ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించారు.



 వైద్యపరీక్షల అనంతరం కేసునమోదు  చేస్తాం.. 


ఈ ఘటనపై విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కె మీనా మాట్లాడుతూ ఈ విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సుధాకర్ జాతీయ రహదారిపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో డైలీ హండ్రెడ్ కి ఫోన్ కాల్ వచ్చిందని దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి డాక్టర్ను అక్కడి నుండి వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ డాక్టర్ పోలీస్ కానిస్టేబుల్ సెల్ ఫోన్ లాక్కొని విసిరేశారు అని సీపీ తెలిపారు ఈ ఘటనలో డాక్టర్పై దురుసుగా దురుసుగా ప్రవర్తించిన కాల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు అలాగే మద్యం మత్తులో హంగామా చేసిన డాక్టర్ సుధాకర్ ను ఆల్కహాల్ పరీక్ష నిమిత్తం కింగ్ జార్జ్ ఆసుపత్రి కి తరలించామని పేర్కొన్నారు ఆల్కహాల్ పరీక్ష అనంతరం 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు గత కొంతకాలంగా డాక్టర్ సుధాకర్ మానసింగా ఇబ్బందులు పడుతున్నారని దీని వలనే ఈ సంఘటన చోటుచేసుకుందని సి పి ఆర్ కె మీనా అభిప్రాయపడ్డారు


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా