యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు: కలెక్టర్

విశాఖపట్నం:  నగరంలోని ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంపై కలెక్టర్ వినయ్ చంద్ ఆరా తీశారు.  విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిస్థితి అదుపులో రావడానికి మరో రెండు గంటల సమయం పట్టొచ్చని తెలిపారు.


సుమారు 150 నుంచి 200 మంది వరకు అస్వస్థతకు గురై ఉంటారని భావిస్తున్నామన్నారు.  లాక్‌డౌన్ కారణంగా యంత్రాలను ప్రారంభించే క్రమంలో ఫైర్ కావడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు.  పరిస్థితిని అదుపుచేసేందుకు  ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసుల శ్రమిస్తున్నారని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా