దేశంలో 71 వేలకు చేరుతున్న కరోనా కేసులు....




నిబంధనల సడలింపు తో పెరుగుతున్న కేసులు..


స్వీయ నియంత్రణ ప్రథమ లక్ష్యం...


లాక్ డౌన్ తో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు సామాజిక దూరం పాటించాల్సిందే...


అలక్ష్యం వహిస్తే కరోనాతో కుస్తీ తప్పదు...


ప్రభుత్వాలు ఎన్ని చేసినా తప్పని ముప్పు..


కరోనా కావాలా, పోవాలా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతోంది....


 






న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూ 71 వేల మార్కు దాటిపోయింది లాక్ డౌన్ విధించిన తొలినాళ్ళలో దేశమంతటా పటిష్ట వంతంగా సామాజిక దూరం పాటించడం జనసంచారం ఎక్కడికక్కడ కట్టడి చేయడం ఎటువంటి సడలింపులు లేకపోవడంతో వందల సంఖ్యలో ఉన్న కరోనా పాజిటివ్ కేసులు లాక్ డౌన్ సడలింపులతో 5 అంకెల సంఖ్యను దాటిపోయే దిశగా పరుగు పెడుతున్నాయి.  రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, 70వేల దాటిపోయింది.  భారత్ లో కరోనా పాజిటివ్ వెలుగు చూసిన జనవరి 30 నాటికి ఒక్క కేసు ఉంటే వంద రోజులు పూర్తయ్యేసరికి 71 వేలకు అతి చేరువలో ఉండడం దురదృష్టకర పరిణామం. 

కరోనా దానంతట అది వ్యాప్తి చెంది వైరస్ పంచే అవకాశం లేదు కానీ వైరస్ వ్యాప్తికి మానవులే కారకులుగా పరిగణిస్తున్నారు ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూ దేశంలో సుమారు 71 వేల మందికి చేరింది ఎప్పటికైనా ఈ గొలుసుకట్టు కు బ్రేక్ వేయకుంటే నిపుణుల అంచనా మేరకు 5 లక్షలకు చేరిన ఆశ్చర్యం లేదు ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన భూమిక పోషిస్తున్న మానవులు సామాజిక దూరం పాటించడం ద్వారా నివారించడం ఒక్కటే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది ఓవైపు దేశంలో ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడంలో భాగంగా లాక్ డౌన్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నప్పటికీ ప్రజలు తమంతట తాము నిర్బంధించడం ద్వారా మాత్రమే తనతో పాటు తన కుటుంబం సమాజాన్ని కాపాడుకునే అవకాశం ఉందన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. సామాజిక దూరం పాటించకుంటే ఈ మహమ్మారి ఈ సమాజాన్ని ఎటు తీసుకు వెళుతుందో ఎవరికి ఎరుక ఏ క్షణంలో ఎవరికి అంటుందో ఏం చేస్తుందో అని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

 దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ మంగళవారం ఉదయం నాటికి దేశ వ్యాప్తంగా 70,756 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3604 పాజిటివ్‌ కేసులతో పాటు 87 మంది  మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2293కి చేరింది. దేశంలో ప్రస్తుతం 46,006 కరోనా యాక్టివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు ఇప్పటి వరకు 22454 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చారి అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా వివరాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి.  ఇటీవల లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత కరోనా కేసులు అధిక మొత్తంలోో పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి.





రాష్ట్రాల వారిగా నమోదైన కేసులు మృతుల వివరాలు ఇలా ఉన్నాయి.


మహారాష్ట్రలో 23,401 పాజిటివ్ కేసులు, 868 మంది మృతి


గుజరాత్‌లో 8,542 పాజిటివ్ కేసులు, 513 మంది మృతి


తమిళనాడులో 8,002 పాజిటివ్ కేసులు, 53 మంది మృతి


ఢిల్లీలో 7,233 పాజిటివ్ కేసులు, 73 మంది మృతి


రాజస్తాన్‌లో 3,988 పాజిటివ్ కేసులు, 113 మంది మృతి


మధ్యప్రదేశ్‌లో 3,785 పాజిటివ్ కేసులు, 221 మంది మృతి


ఉత్తరప్రదేశ్‌లో 3,573 పాజిటివ్ కేసులు, 80 మంది మృతి


పశ్చిమబెంగాల్‌లో 2,063 పాజిటివ్ కేసులు, 190 మంది మృతి


ఆంధ్రప్రదేశ్‌లో 2,051 పాజిటివ్ కేసులు, 46 మంది మృతి


పంజాబ్‌లో 1,877 పాజిటివ్ కేసులు, 31 మంది మృతి 


జమ్మూకశ్మీర్‌లో 879 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి


కర్ణాటకలో 862 పాజిటివ్ కేసులు, 31 మంది మృతి


హర్యానాలో 730 పాజిటివ్ కేసులు, 13 మంది మృతి




Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా