ప్రజా నిర్ణయం మేరకే భవిష్యత్ ప్రణాళిక
బాధితుల వద్దకు వెళ్లి శాంతించాలి అంటూ మంత్రులు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి
విశాఖపట్నం (జనహృదయం): విశాఖ ఎల్జి పాలిమర్స్ దుర్ఘటనపై మృతదేహాల తో చేపట్టిన ప్రజా ఆందోళన శాంతి చేందుకు శాంతింప చేసేందుకు మంత్రులు విస్తృత ప్రయత్నం చేస్తున్నారు ప్రజా నిర్ణయం మేరకే భవిష్యత్తులో ఎల్జి పాలిమర్స్ పనులు నిర్వహణ జరుగుతుందని శాంతియుతంగా సమస్య పరిష్కరిస్తామని ప్రజలు ఎవరు ఆందోళన చెందనవసరం లేదని మంత్రులు బాధితులకు నచ్చచెప్పారు అయినప్పటికీ వారి ఆందోళన కొనసాగిస్తున్నారు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలోనూ ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటకుు వచ్చినా ప్రజలు తమ ఆవేేదనను వెలిబుచ్చుతున్నారు అని దీనిిని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రజల వేదన గోడు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని ప్రజల నిర్ణయం మేరకే భవిష్యత్్ కార్యక్రమాలు ఉంటాయని మంత్రులుు అవంతి శ్రీనివాసరావు కృష్ణదాస్ తదితరులు హామీ ఇచ్చారు
ప్రజలంతా ఆందోళన విరమించి తమ బంధువుల మృతదేహాలకు అంత్యక్రియలు చేపట్టాలని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిటీ నివేదిక అనంతరం ప్రజల నిర్ణయం కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రజలకు న్యాయం జరిగే వరకూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని వారు హామీ ఇచ్చారు
Comments
Post a Comment