దేశంలో 67వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
సీఎంలతో ప్రధాని మోడీ కరోనా పై నేడు ఐదోసారి సమీక్ష
భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం
మోడీతో మధ్యాహ్నం మూడు నుండి 6 గంటల వరకు జరగనున్న సీఎంల వీడియో కాన్ఫరెన్స్
(జనహృదయం ప్రతినిధి - రాజన్)
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దేశంలో కరోనా మొదటి కేసు నమోదైన 100రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి భారీగా పెరుగుతోంది వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4,213 పాజిటివ్ కేసులు నమోదు కాగా 97 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 67,152కి, మృతుల సంఖ్య 2206కి చేరింది. అలాగే ఇప్పటివరకు 20,917 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 44,029 యాక్టివ్ కేసులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
నాలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా
దేశంలో కరోనా వైరస్ మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్రలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22171కి చేరింది. వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 832 మంది మరణించారు. గుజరాత్‌లో మొత్తం 8194 కరోనా కేసులు నమోదవగా, 493 మంది మృతిచెందారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 7200కు చెరింది. దేశ రాజధాని ఢిల్లీలో 6923కు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 3614 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 214 మంది మృతిచెందారు. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2123కి చేరగా, మృతులు సంఖ్య 48కి చేరింది. వీటితో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ కరోనా కేసులుు ముద్దులతో అవుతున్నాయిి.
నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
కరోనా మహమ్మారి కట్టడి లో భాగంగా దేశవ్యాప్తంగా మూడు దఫాలుగా 48 రోజులపాటు కొనసాగుతున్న లాక్ డౌన్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఈరోజు మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఈ సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు స్తంభించి పోవడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడంతో పాటు పెరుగుతున్న పాజిటివ్ కేసుల కట్టడి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరగనుంది.
Comments
Post a Comment