దేశంలో 50 వేలకు చేరువలో కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే 50 వేలకు అతి చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదు కాగా, 126 మంది మృతిచెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 14,182 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి  డిశ్చార్జి కాగా, 1,694 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 33,514 కరోనా యాక్టివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 15,525 కరోనా కేసులు నమోదు కాగా, 617 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 6,245, ఢిల్లీలో 5,104, తమిళనాడులో 4,058, రాజస్తాన్‌లో 3,158, మధ్యప్రదేశ్‌లో 3,049, ఉత్తరప్రదేశ్‌లో 2,880,  ఆంధ్రప్రదేశ్లో 1777 కరోనా కేసులు నమోదయ్యాయి.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా