దేశవ్యాప్తంగా 46 వేలు దాటినా కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభిస్తూ గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,900 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 46,433కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.  కాగా, ఒక్క రోజు వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం తొలిసారి కావడంతో కొంతమేర ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12,726 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,568 మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 32,138 కరోనా  యాక్టివ్‌ కేసులకు  చికిత్స అందిస్తున్నారు. . దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్యలో సగానికి పైగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీలలోనే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 14, 541 కరోనా కేసులు నమోదు కాగా, 583 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 5,804, ఢిల్లీలో 4,898, తమిళనాడులో 3,550, రాజస్తాన్‌లో 3,061, మధ్యప్రదేశ్‌లో 2,942, ఉత్తరప్రదేశ్‌లో 2,776, ఏపీలో 1717పాజిటివ్ కేసులు  కరోనా కేసులు నమోదయ్యాయి.  


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా