మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగింపు ...
న్యూఢిల్లీ (జనహృదయం): దేశంలో నాలుగో విడత లాక్ డౌన్ మే31 వరకు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ దఫా లాక్ డౌన్ మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న 30 జిల్లాల పై కేంద్రం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనుంది కాగా 4.0 లాక్ డౌన్ మార్గదర్శకాల్లో కొన్ని నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రీన్ ఆరెంజ్ జోన్ లలో సడలింపు లను భారీగా ఇవ్వనుంది ప్రజా రవాణాపై కూడా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే కట్టబెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది అలాగే వైరస్ కట్టడి, వ్యాప్తి పట్ల నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించవద్దని కూడా కేంద్రం మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తోంది
Comments
Post a Comment