ఏడుగురు మృతి 200 మంది అపస్మారక స్థితిలో

విశాఖపట్నం: జిల్లా పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జి పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున రసాయన వాయువు లీకేజీ అయిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా, 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.


కాగా ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.  గ్యాస్‌ లీకేజీ జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరికొద్ది సేపట్లో రానున్నారు.  పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు.


అంతకుముందు ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు.  తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా