20 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని

 



స్తంభించిన ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ


రేపు విధి విధానాలు ప్రకటించనున్న ఆర్థిక మంత్రి


అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత జిడిపిలో 10 శాతం ప్యాకేజీగా ప్రకటించిన ప్రధాని


ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు పంచ సూత్రాల మోడీ మంత్రం…


 అవసరాలకు అనుగుణంగా దేశీయ ఉత్పత్తి…


పౌరులంతా దేశీయ ఉత్పత్తులనే వాడాలి అని సంకల్పం తీసుకోవాలి…


మేక్ ఇన్ ఇండియా కోసం నడుం బిగించాలి…


(జనహృదయం  ప్రతినిధి – రాజన్)


న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా విధించిన లాక్ డౌన్ తో క్షీణించిన భారత ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.  మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ భారతావనిని ఆదుకునేందుకు ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు పంచ సూత్రాలతో పురోభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు దీనికోసం ” ఆత్మ నిర్మల్ భారత్ అభియాన్” పథకం ద్వారా  20 లక్షల కోట్ల తో ప్రకటించిన ప్యాకేజీ ఆధారంగా భారతావనిని ఆదుకునేందుకు ప్రధానమంత్రి నిర్ణయించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న వరుసలో ఉన్న భారత్ ఈ సంక్షోభాన్ని ఆదుకునేందుకు జిడిపిలో పది శాతం నిధులతో ప్యాకేజీ ప్రకటించడం భారతదేశ గర్వ కారణంగా చెప్పుకోవచ్చు.


మేక్ ఇన్ ఇండియా నినాదమే ధ్యేయంగా…


దేశంలో పేదలు వలస కార్మికులు అధికారులను ఈ పథకం ద్వారా ఆదుకుంటామని ప్రకటించారు అలాగే దేశంలో వ్యవసాయం కార్మికులను కుటీర పరిశ్రమలు ప్రోత్సాహం అందిస్తామన్నారు.  ఆర్థిక రంగం అభివృద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరూ మేకిన్ ఇండియా నినాదంతో ముందుకు సాగాలని ప్రధానమంత్రి కోరారు భారతదేశంలో ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించేందుకు దేశీయ ఉత్పత్తులను వాడటం దేశీయంగా ప్రజల అవసరాలను తీర్చేందుకు ఉత్పత్తి వ్యవస్థలను సమకూర్చుకోవాలని కోరారు దీనికోసం ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తుంది అన్నారు. భారత్ ఆదాయం పరుల పాలు కాకుండా దేశీయ ఆర్థిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు తాము అభివృద్ధి సాధించుకోవాలని ప్రధాని సూచించారు. అన్ని అవసరాలకు దేశీయంగా ఉత్పత్తి అయ్యే వాటిని ఉపయోగించాలన్న సంకల్పాన్ని స్వీకరించాలని ప్రధాని కోరారు


ప్రపంచ దేశాలకు ఆదర్శంగా…


ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచి కరోనా కట్టడిలో భారత్ సంకల్పబలం చాటి చెప్పిందని  ని మోడీ పేర్కొన్నారు.  భవిష్యత్తులో భారత్ ప్రపంచ దేశాలకు దీటుగా అభివృద్ధి సాధించే దిశగా పయనిస్తుందని ప్రకటించారు ఈ దిశగా ప్రతి ఒక్కరూ సంక్షోభాన్ని  గెలిచి సంకల్పమే ద్యేయంగా ముందడుగు వేయాలని కోరారు. ప్రపంచానికి ఔషధాలు అందించే స్థాయికి భారత్ చేరింది అని గుర్తు చేశారు.


మోదీ పంచ సూత్రాల అభివృద్ధి మంత్రం…


1.ఆర్థిక రంగం  2. మౌలిక రంగం  3.టెక్నాలజీ   4.వనరులు 5.సప్లయ్ డిమాండ్


లాక్ డౌన్ కారణంగా స్తంభించిపోయిన ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు భారత పౌరులంతా పంచ సూత్రాలు దేశానికి మూల స్తంభాలుగా భావించి ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను ప్రధాని వివరించారు. దేశీయ ఆర్థిక రంగం పురోగతి సాధించేందుకు మౌలిక రంగం ద్వారా టెక్నాలజీని ఉపయోగించి వనరులను పెంపొందించుకోవాలని ప్రజల అవసరాల ఆధారంగా ఉత్పత్తి పెంచుకొని సరఫరా చేయాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ముందుకు సాగాలని దీనికోసం తాను ప్రకటించిన ప్యాకేజీ పూర్తిగా వినియోగించుకోవాలని ఈ దిశగా పౌరులంతా ప్రతిన బూని ముందుకు సాగాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.


మానసికంగా మద్దతునిచ్చిన మోడీ…


రోజు రోజుకి పెరుగుతున్న కరోనా మహమ్మారిని కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయని దీని కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  కరోనా యుద్ధం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని ఎట్టి పరిస్థితుల్లోనూ  ఈయుద్ధాన్ని భారత్ గెలిచి తీరుతుంది అని ప్రధాని స్పష్టం చేశారు. దీనికోసం ఎవరు అధైర్య పడవద్దని ఒకప్పుడు వైద్యపరంగా పొరుగు దేశాల పై ఆధారపడిన భారత్ స్వయంగా   నేడు రోజుకి లక్షలాది పి పి ఈ కిట్లు మాస్కులు ఉత్పత్తి చేస్తోందని కరోనా ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లుతో సిద్ధమవుతున్నామని ప్రధాని భారత వాసులకు భరోసానిచ్చారు. అయితే ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ కరోనా కట్టడికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ యుద్ధాన్ని గెలువడంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా