ఏపీలో 1883 చేరిన కరోనా కేసుల సంఖ్య
విజయనగరం జిల్లానూ వదలని కరోనా ...
అమరావతి :ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకి ఉదృతం అవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1833కు చేరుకుంది. ఇప్పటివరకు 780 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు 38 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం యక్టివ్ గా ఉన్న 1015 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.
కాగా ఈ రోజు కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 8,087 శాంపిల్స్ పరీక్షించగా 56 మందికి పాజిటివ్ అని తేలింది.
కొత్తగా నమోదయిన కేసుల వివరాలిలా ఉన్నాయి. కృష్ణాలో 16, గుంటూరు 10, కర్నూలు 7, విశాఖలో 7, నెల్లూరులో 4, కడప 6, అనంతపురం 3, విజయనగరంలో 3 చొప్పున కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి.
Comments
Post a Comment