ఏపీలో 1777 చేరిన పాజిటివ్ కేసులు
అమరావతి : ఏపీలో లో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,777కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో 7,782 శాంపిల్స్ పరీక్షించగా.. 60 మందికి కరోనా నిర్దారణ అయినట్టు పేర్కొన్నారు. వీరిలో తూర్పు గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 12, వైఎస్సార్ జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 17, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతోపాటుగా కర్ణాటకకి చెందినవి 1, గుజరాత్‌కు చెందినవి 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో మిగతా 7 జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 729కి కాగా కరోనాతో 36 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1012 మంది కరోనాతో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో ఇప్పటివరకు 1,42,274 కరోనా టెస్టులు నిర్వహించి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచారు.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
Comments
Post a Comment