ఏపీలో 1,717కి చేరిన కరోనాపొజిటివ్ కేసుల సంఖ్య
అమరావతి :ఏపీలో కరోనాపొజిటివ్ కేసుల సంఖ్య 1,717కి చేరింది. మంగళవారం కొత్తగా మరో 67 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 1717కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 8,263 పరీక్షలు నిర్వహించగా 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపింది. కొత్తగా అనంతపురం జిల్లాలో 2, గుంటూరులో 13, వైఎస్సార్ జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 2 కరోనా కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. అలాగే గుజరాత్ నుంచి వచ్చిన 14 మందికి కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. గడిచిన 24 గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరిలో కర్నూలు జిల్లాలో 28, గుంటూరు జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు 589 కరోనా నుంచి కోలుకోని ఇళ్లకు వెళ్లగా , రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 34 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,094 కరోనా యాక్టివ్ కేసులకు వివిధ ఆసుపత్రిలలో చికిత్స్త చేస్తున్నారు.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి ....
.
Comments
Post a Comment