డా.సుధాకర్ కేసు సీబీఐ కి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశం...
సుధాకర్ పై చేయిచేసుకున్న పోలీసులపై కేసునమోదుచేసి విచారణ చేపట్టాలని ఆదేశించిన న్యాయస్థానం అమరావతి : విశాఖలో వైద్యాధికారి సుధాకర్ పై దాడి ఘటనలో కేసు నమోదుచేసి విచారణ చేపట్టాలని హైకోర్ట్ ఆదేశించింది. డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారంపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. డాక్టర్ సుధాకర్‌పై దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ శరరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్ సుధాకర్ గాయాల గురించి పేర్కొనలేదని కోర్టు పేర్కొంది.. వైద్య సిబ్బందికి మాస్కులు లేవంటూ గతంలో వ్యాఖ్యానించి సస్పెండైన మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారని పోలీసు అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. సుదాకర్ గొడవ చేస్తున్నట్లు స్థానికులు 100కు ఫోన్‌చేయడంతో పోలీసు అక్కడికి వెళ్లారు. పోలీసులను, ముఖ్యమంత్రిని డాక్టర్ సుధాకర్ దుర్భాషలాడటంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసు తెలిపారు....