సంగడ సబ్ సెంటర్ హెల్త్ అసిస్టెంట్ సస్పెన్షన్
పాడేరు (జనహృదయం) : ముంచంగిపుట్టు మండలం లబ్బూరు పి.హెచ్ సి పరిధి లోని సంగడ సబ్ సెంటర్ హెల్త్ అసిస్టెంట్ కె.చినసత్యనారాయణ ను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పి.ఓ డి.కె .బాలాజీ మంగళవారం వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కె. చిన్న సత్యనారాయణ. గతనెల 14 నుంచి విధులకు హాజరు కావడంలేదని చర్యలు తీసుకున్నారు.
ఎపిడిమిక్ సమయంలో మలేరియా నిర్ములనా కార్యాచరణ సక్రమంగా అమలు చేయకపోవడం, విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన చర్యలు చేపట్టామన్నారు.పి ఓ డిటీటీ రత్నకుమార్ ను విచారణాధికారిగా నియమించారు. విచారించి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
సస్పెన్షన్ ఉత్తర్వులు అమలు చేయాలని అదనపు జిల్లా వైద్యాధికారి ని ఆదేశించారు.
Comments
Post a Comment