ఓ పేద మహిళలకు సెల్యూట్ చేసిన డిజిపి

(విజయవాడ - జనహృదయం)


అమ్మా నీకు వందనం నీ తల్లి ప్రేమకు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ వందనం చేస్తుందంటూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఓ పేద మహిళకు సెల్యూట్ చేశారు శనివారం డిజిపి తన కార్యాలయం నుండి  తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న లోకమని తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఆమెకు సెల్యూట్ చేశారు. ఆమె పేరు లోకమని తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు ఈమె చేసిన పనికి డీజీపీ స్పందించి సెల్యూట్ చేశారు. వివరాల్లోకి వెళితే కన్నతల్లికి తన పిల్లల ఆకలి దప్పికలు తెలుస్తాయి అన్నట్టు  పోలీసులు లాక్ డౌన్ సందర్భంగా మండుటెండను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న తీరును చూసి చలించిపోయిన ఆ తల్లి తన దగ్గర ఉన్న డబ్బులతో కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి పోలీసులకు ఇవ్వడం తల్లి ప్రేమను రుజువు చేసినట్లయిందని డీజీపీ పేర్కొన్నారు ఈ ఘటన పోలీసులకు తమ తల్లులను గుర్తు చేసిందని అన్నారు పోలీసుల విధి నిర్వహణలో ఇటువంటి సంఘటనలు ఆత్మస్థైర్యాన్ని నింపి మరింత బాధ్యతాయుతంగా ముందుకు సాగేందుకు దోహదపడతాయని డిజిపి అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఆ అమ్మకు  డీజీపీ గౌతమ్ సవాంగ్ వందనం చేశారు కేవలం నెలకు మూడు వేల ఐదు వందలు రూపాయల జీతం ఉన్న పేద తల్లి పోలీసుల దాహం తీర్చేందుకు ముందుకు రావడం తన హృదయాన్ని కదిలించిందని డిజిపి అన్నారు ఈ సందర్భంగా లోకమని కి డిజిపి వందనం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా