నేటి ముఖ్యాంశాలు

మూడో విడత రేషన్ పంపిణీకి సిద్ధం


►ఏపీలో నేటి నుంచి మూడో విడత ఉచిత రేషన్ పంపిణీకి ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.  రాష్ట్ర వ్యాప్తంగా బియ్యంకార్డు ఉన్న1,47,24,017 కుటుంబాలకు లబ్ది చేకూరే విధంగా రంగం సిద్ధం చేశారు.  అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 81,862 పేద కుటుంబాలకు కూడా ఉచిత రేషన్ అందించనున్నారు.


ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా  1,48,05,879 కుటుంబాలకు చేయూత అందించేందుకు ప్రభుత్వం వన్ కసరత్తు ముమ్మరం చేసింది.


సొంత గూటికి చేరనున్న మత్స్యకారులు


► లాక్ డౌన్ కారణంగా గుజరాత్ లో చిక్కుకున్న ఏపీకి చెందిన మత్స్యకారులను తీసుకువచ్చేందుకు చేసిన ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ మేరకు వారు ఏపీకి చేరుకోనున్నారు.  గుజరాత్ లో చిక్కుకున్న ఐదువేల మంది మత్యకారులను 60 బస్సుల్లో విడతలవారీగా ఏపీకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.


కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి


►ఏపీలో  1,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా  ఇప్పటివరకు 258 మందిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.  ఈ మహమ్మారి బారినపడి 31 మంది మృతి చెందారు. ప్రస్తుతం 970 యాక్టివ్ కేసులు ఉండగా వారికి చికిత్స అందిస్తున్నారు.


తెలంగాణ :


►తెలంగాణలో  1,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 374 మంది కరోనా బాధితులు కోరుతున్నారు. ఈ వ్యాధితో  25 మంది మృతి చెందారు. ప్రస్తుతం 610 యాక్టివ్ కేసులు చికిత్సపొందుతున్నాయి.


జాతీయం :


►దేశవ్యాప్తంగా మొత్తం 29,435 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా ఇప్పటివరకు 6,868 మంది డిశ్చార్జ్ అయ్యారు  ఈ వ్యాధితో  మొత్తం 934 మంది మృతి చెందారు.  ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్ కేసులకు వైద్య సేవలు అందిస్తున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా