పోలీసుల పనితీరు హర్షనీయం సీఎం

కరోనా  వ్యాప్తిని తగ్గించేందుకు కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి పోలీసులు తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే కొందరు పోలీసులు చేస్తున్న ఓవరాక్షన్ వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. పలుచోట్ల పౌరులను పోలీసులు కారణం లేకపోయినా చితకబాదుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై సీఎం జగన్ డీజీపీ సవాంగ్‌కు పలు సూచనలు చేశారు. శుక్రవారం సీఎం జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోలీసుల తీరుపై ఆయన క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.








సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల పోలీసులు అనుసరించాల్సిన విధానం పట్ల కూడా దృష్టిపెట్టాలని డీజీపీ సవాంగ్‌కు సూచించారు. పోలీసులపై విపరీతమైన పని ఒత్తిడి ఉందనే విషయాన్ని తాము అంగీకరిస్తామని చెప్పారు. అయితే పౌరులపై మనం ఉపయోగించే భాష, వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్న తీరు కూడా ముఖ్యమని సీఎం జగన్ పేర్కొన్నారు. గౌరవ, మర్యాదలు చూపుతూనే లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని పోలీసులకు సూచించారు. అలాగే బాపట్ల యువకుడు ఆత్మహత్య కేసు విషయంలో విచారణ చేయించాలని ఆదేశించారు.          అలాగే రాష్ట్రం వెలుపల ఉన్న తెలుగువారి పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. దీంతో ముంబై, గిర్, వారణాసి, గోవా, అజ్మీర్, తమిళనాడు ప్రాంతాల్లో పలువురు తెలుగువారు చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు. అయితే వీరికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పెద్ద సంఖ్యలో తెలుగు వారు ఉన్నచోటకు ఓ అధికారిని పంపి వారి బాగోగులపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.







Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా