కరోనా ను జయించిన పసిప్రాయం

ఉత్తరాఖండ్ :  కరోనా మహమ్మారికి గురైన పసిప్రాయం కేవ‌లం ఆరు రోజుల్లోనే క‌రోనాను జ‌యించి 9 నెల‌ల బాలుడు రికార్డు సృష్టించాడు. దీనికి అక్కడి వైద్యులు సాధించిన ఘనత గా పేర్కొనవచ్చు. కాగా చిన్న వ‌య‌సులో, అతి త‌క్కువ స‌మ‌యంలో కోవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్లో చోటుచేసుకుంది. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఏప్రిల్ 17న హాస్పిట‌ల్ లో చేర్పించ‌గా, క‌రోనా పాజిటివ్ అని తేలింది.  తండ్రి ద్వారా  చిన్నారికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. శిశువు తండ్రి తబ్లీగా జమాత్‌కు వెళ్లి రాగా,  కరోనా సోకడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే చిన్నారి మాత్రం ఆరు రోజుల్లోనే ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. 48 గంట‌ల వ్య‌వ‌ధితో రెండుసార్లు  కరోనా నెగిటివ్ రావ‌డంతో గురువారం చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. ఈ సంఘటనపై  ఆసుపత్రి వైద్యులు ఎన్‌ఎస్‌ ఖాత్రి మాట్లాడుతూ 9 నెలల వయసున్న పసికందు కావడంతో ఈ కేసు ఛాలెంజింగ్‌గా తీసుకున్నామని అన్నారు. ఈ బాబు ఉ త‌ల్లికి మాత్రం క‌రోనా సోక‌లేదు. అయిన‌ప్ప‌టికీ చిన్నారితో పాటు తల్లి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని డాక్టర్లు వివరించారు. బాగా నువ్వుతూ చ‌లాకీగా ఉంటూ చికిత్సకు స‌హ‌క‌రించాడ‌ని అయితే, ఎక్కువ‌గా మందులు వాడ‌లేద‌ని పేర్కొన్నారు. పసి బాలుడు కరోనా వ్యాధి నుండి కోలుకోవ‌డం తమకెంతో సంతోషంగా భావిస్తున్నామని వైద్య్య్య బృందం పేర్కొంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా