దేశంలో వెయ్యి దాటినా కరోనా మృతులు ...
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ తో గడిచిన 24 గంటల్లలో 73 మందిమృతి చెందడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1007కి చేరింది. ఈ మేరకు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు భారత్‌లో 31,332 కరోనా కేసులు నమోడు అవగా 7,695 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం దేశంలో 22,629 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 9,318 కరోనా కేసులు నమోదు కాగా, 400 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 3,744, ఢిల్లీలో 3,314, మధ్యప్రదేశ్‌లో 2,387, రాజస్తాన్‌లో 2,364, తమిళనాడులో 2,058, ఉత్తరప్రదేశ్‌లో 2,053 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్రం పేర్కొంది.
Comments
Post a Comment