ఏపీలో 893 చేరిన కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి : ఏపీలో కొత్తగా 80 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదవగా, రాష్ట్రంలో పాజిటీవ్ కేసులు సంఖ్య 893 చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 6522 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. వీటిలో కర్నూలు 31, గుంటూరు 18, చిత్తూరు 14, అనంతపురం 6, తూర్పుగోదావరి జిల్లా 6, కృష్ణా 2, ప్రకాశం 2, విశాఖ జిల్లాలో 1 కేసు చొప్పున కొత్తగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 234 కేసులు, గుంటూరు జిల్లాలో 195 కేసులు నమోదు అయినట్లు అయింది. కాగా ఇప్పటివరకు 27 మంది మృతి చెందగా, 141 మంది రోగులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Post a Comment