ఏపీలో 420 కి చేరిన కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంది. అధికార యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ ప్రజలు కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలుకు పూర్తిస్థాయిలో సహకరించక పోవడం వల్ల పాజిటివ్ కేసులు దినదిన అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికైనా ప్రజలు చైతన్యంతో లాక్ డౌన్ అమలుకు పూర్తిస్థాయిలో సహకరించి కరోనా కట్టడికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వాధినేతలు వేడుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మార్చి 23 నుండి కొనసాగుతున్న లాక్ డౌన్ పై ప్రధానమంత్రి నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించేే అవకాశం…
*ఆంధ్రప్రదేశ్:*
► ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420కి చేరింది..
► ఏపీలో ప్రస్తుతం 401 యాక్టివ్ కేసులు ఉన్నాయి..
► ఇప్పటి వరకు 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
► కరోనా వైరస్‌తో ఏడుగురు మృతి చెందారు.
► పల్లెల్లో పంటల కొనుగోళ్లు
► గ్రామస్థాయిలో 786 కేంద్రాలు ఏర్పాటు..
► నేటి నుంచి జొన్న, మొక్కజొన్న , శనగలు, కంది, పసుపు కొనుగోలు..
► నేటి నుంచి కృష్ణా జిల్లాలో రోజుకు 800 నుంచి 1000 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు..
*తెలంగాణ*
► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 531కి చేరింది.
► తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు.
► కరోనా నుంచి కోలుకుని 103 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► తెలంగాణలో ప్రస్తుతం 412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
*జాతీయం:*
► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,211గా నమోదైంది.
► దేశంలో కరోనాతో ఇప్పటివరకు 331 మంది మృతి చెందారు.
► మహారాష్ట్రలో 1,982 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 149 మంది మృతి చెందారు..
*అంతర్జాతీయం:*
► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18.52 లక్షలకు చేరింది.
► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.14 లక్షల మంది మృతి చెందారు..
► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 4.23 లక్షల మంది కోలుకున్నారు..
Comments
Post a Comment