మే 3 వరకు కొనసాగనున్న లాక్ డౌన్: ప్రధాని మోదీ

 


ఆర్థిక పరిస్థితి కంటే ప్రజల ప్రాణాలు మిన్న


కేసులు పెరగకుండా కఠినతరం చేయనున్న లాక్ డౌన్


(జన హృదయం ప్రతినిధి – విశాఖపట్నం ) :


దేశవ్యాప్తంగా మే 3 వరకు పొడిగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం ప్రకటించారు దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ప్రధాన మార్గమని సామాజిక దూరం పాటించడం ద్వారానే ఈ వ్యాధి నివారణకు సాధ్యమవుతుందని ప్రధాని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితిలో ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచుకోవడం కంటే ప్రజల జీవితం ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డోన్ యధావిధిగా కొనసాగించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రజలు తమ ఆహారానికి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని కూడా ప్రధాన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు


ప్రపంచవ్యాప్తంగా కరోనా నివారణలో భారత్ ముందు నిలిచిందని ప్రధానిి పేర్కొన్నారు ఇదే ఐక్యమత్యంతోోో దేశ ప్రజలంతా మరో 19 రోజులపాటు సామాజిక దూరాన్ని పాటిస్తూ విజయవంతంగా కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోవాలని ప్రధాని కోరారు ప్రజల జీవనశైలిలో ఎదుర్కొంటున్నన ఇబ్బందులు అన్నీ తనకు తెలుసునని వేరే మార్గం లేని పరిస్థితిలో ఇటువంటిి కఠిన నిర్ణయం తీసుకోవాల్సిిిన పరిస్థితి వచ్చిందని ప్రజలంతా సహృదయంతో అర్థం చేసుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు


దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రకటించిన రెడ్ జోన్ హాట్స్పాట్ లలో ఏప్రిల్ 20 నుండి దశలవారీగా నిబంధనలు సడలింపు ఉంటుందని అప్పటివరకు కఠినంగా లాక్ డౌన్ అమలు చేసి  ఎట్టి పరిస్థితుల్లోనూ పాజిటివ్ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు దేశ ప్రజలంతా తాను పిలుపునిచ్చినా లాక్ డౌన్ కు ఐక్యమత్యంతో సహకరించి కరోనా వ్యక్తిని అడ్డుకోవడంలో సహకరించి తోడ్పాటు అందించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా