నర్సాపురం చేరిన ట్రైన్ ఆసుపత్రి

.


రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నర్సాపురం స్టేషన్ కు పది కోచ్ లతో కూడిన ప్రత్యక రైలు ను కేటాయించింది. ఈ మేరకు స్థానిక రైల్వే స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్టేషన్ లోని కోచ్ కేర్ డిపో ఆధ్వర్యం లో పది బోగి లలో 100బెడ్స్ ఏర్పాటు కు అన్ని చర్యలు ముమ్మరంగా జరుగు తున్నాయి. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు గురించి స్టేషన్ మేనేజర్ మధుబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికీ ఆరు బోగిలలో పని పూర్తి అయ్యిందని, రేపటికి మొత్తం పని పూర్తి అయ్యి పది బోగీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పడి కోచ్ లలో యెనిమిది జనరల్ కోచ్ లు, రెండు స్వీపర్ కోచ్ లు ఉంటాయన్నారు. కరోనా బాధితుల సేవల కోసం , సామాజిక సేవలో భాగంగా ప్రత్యేక బోగీలను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలను చేపట్టింది అని వివరించారు. బోగి లో ఆక్షిజన్ తో బాటు వైద్య పరీక్షలు కు సంబంధించి కీట్స్ కూడా ఉంటాయన్నారు. అలాగే వైద్య సిబ్బంది కి బోగి లో ప్రత్యేక గది ఉందన్నారు. కరోనా కేసులకు వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా బోగి లను సిద్దం చేస్తున్నట్లు స్టేషన్ మేనేజర్ తెలిపారు. సౌత్ జోన్ పరిధిలోని నర్సాపురం, మచిలీపట్నం,కాకినాడ, విజయవాడ స్టేషన్ లకు 50 కోచ్ లను పంపినట్లు తెలిపారు. కేసులు సంఖ్య అధికంగా ఉండి, చికిత్సకు గదులు లేనప్పుడు బోగీల ను వినియోగించుకునే విధంగా ముందు జాగ్రత్త చర్యలను రైల్వే శాఖ చేపట్టిందని వివరించారు. ఈ అవకాశాన్ని స్థానిక వైద్య సిబ్బంది , ప్రజా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా