పోలీసు లాఠీ కి ఓ నిండు ప్రాణం బలి
గుంటూరు: జిల్లా లోని సత్తెనపల్లి పట్టణంలో ఓ వ్యక్తి పోలీస్ లాఠీకి బలయ్యారన్న వార్త దావానలంలా వ్యాపించింది. వివరాల్లోకి వెళితే సతైనపల్లి పట్టణంలోని వెంకటపతికాలనీకి చెందిన షేక్ మొహమ్మద్ గౌస్ సోమవారం ఉదయం నిత్యావసర సరుకుల కోసం బయటకు వచ్చిన సందర్భంలో పోలీసులు ఆపి వివరాలు సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీస్ సిబ్బంది అతనిని లాఠీతో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు వెంటనేే పోలీస్ వాహనంలో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు అయితే మహమ్మద్ గౌస్ కి ఇదివరకే గుండె నొప్పి ఉండడం తో పోలీసు దెబ్బలకు భయాందోళనకు గురై సృహ కోల్పోయి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
శాఖాపరమైన దర్యాప్తు చేసి చర్య తీసుకుంటాం
ఈ ఘటనపై గుంటూరు ఐజి ప్రభాకర్ మాట్లాడుతూ జరిగిన సంఘటనపై శాఖాపరమైన విచారణ చేపడతామని పోలీసులు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు కాగా మహమ్మద్ లాక్ డౌన్ ఈ సమయంలో గౌస్ రోడ్డుపై ప్రయాణిస్తూ పోలీసులు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక భయపడి ఇదివరకున్న గుండె నొప్పి మళ్లీ రావడంతో అపస్మారక స్థితిలో చేరిపోయాడు చేరుకున్నాడని అతనిని ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారని చెప్పారు
సంఘటితంగా ప్రజలు సహకరించాలి
లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా పోలీసులకు సహకరించాలని సంఘటితంగా కరుణ వ్యాధిని అరికట్టేందుకు చేయటం అందించాలని ఐజి ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులకు ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించి రాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు కష్టకాలంలో ప్రమాదకర పరిస్థితులు ప్రాణభయం ఉన్నప్పటికీ పోలీసు సిబ్బంది ముందుండి విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు
Comments
Post a Comment