దేశంలో 24 గంటల్లో 678 కరోనా కేసులు


న్యూఢిల్లీ :  దేశంలో గడిచిన 24 గంటల్లో  678 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, కరోనా మహమ్మారి బారినపడి 33 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పటివరకూ 6402కు పెరిగిందని మృతుల సంఖ్య 199కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 5709 పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం చురుగ్గా ఉండగా 503 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని చెప్పారు. మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య దేశంలోనే అత్యధికంగా 1300 మార్క్‌ను దాటిందని ముంబైలో 381 ప్రాంతాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించారని తెలిపారు.
మరోవైపు కరోనా మహమ్మారి దేశంలో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) దశకు చేరుకోవచ్చని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులున్న 5911 మందిని పరీక్షించగా వారిలో 102 మందికి కరోనావైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయిందని, వారిలో 40 మందికి కరోనా రోగులతో సన్నిహితంగా మెలిగిన ఉదంతం లేదని ఐసీఎంఆర్‌ పేర్కొంది. దేశంలోని 15 రాష్ట్రాల్లో విస్తరించిన 36 జిల్లాల్లో ఇలాంటి రోగులున్నారని, ఈ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా