దేశంలో 24 గంటల్లో 650 కేసులు, 30 మరణాలు



న్యూఢిల్లీ : కరోనా  విజృంభనతో భారత్‌లో పాజిటివ్‌ కేసులు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 650 కేసులు నమోదయ్యాయి. 30 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఒక్క రోజు వ్యవధిలోనే ఆరు వందలకు పైగా కేసులు నమోదవ్వడం ఇదే రికార్డుగా మారింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6412కు చేరింది. మృతుల సంఖ్య 200 చేరువగా ఉంది. ప్రస్తుతం 5709 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 504 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి  అయ్యారనిి కేంద్రం వెల్లడించింంది.
కాగా, దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర 1364 కేసులతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు 834, ఢిల్లీ 720 ఉన్నాయి. 442 కేసులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్‌ 410, కేరళ 357, మధ్య ప్రదేశ్‌ 259, గుజరాత్‌ 241, కర్ణాటక 181, హర్యానా 169, జమ్మూ కశ్మీర్‌ 158, పశ్చిమ బెంగాల్‌ 116, పంజాబ్‌ 101, ఒడిశా 44, బిహార్‌ 39, ఉత్తరాఖండ్‌ 35, అస్సాం 29, చండీగఢ్‌ 18, హిమాచల్‌ ప్రదేశ్‌ 18, జార్ఖండ్‌ 13, అండమాన్‌ నికోబార్‌ 11, చత్తీస్‌గఢ్‌ 11, గోవా 7, పుదుచ్చేరి 5, మణిపూర్‌ 2, త్రిపుర 1, మిజోరాం 1, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 1 వంతున నమోదయ్యాయి.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా