దేశంలో 24 గంటల్లో 1007 కేసులు, 23 మరణాలు
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,007 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 23 మరణాలు సంభవించాయయని వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387 చేరాయని, మొత్తం మరణాల సంఖ్య 437కు చేరిందని తెలిపారు. కరోనా బారినపడిన 1749 మంది కోలుకున్నారని తెలిపారు. ఇది 13.06శాతంతో సమానమని చెప్పారు.
ప్రతి 24 నమూనాళ్లో 1 కరోనా పాజిటివ్ కేసు నమోదవుతోందని అగర్వాల్ వెల్లడించారు. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడానికి కేవలం మూడు రోజులు మాత్రమే పట్టేదని.. అయితే, లాక్‌డౌన్ కాలంలో గత రోజుల డేటాను పరిశీలిస్తే కేసుల రెట్టింపునకు కనీసం 6.2 రోజులు పడుతోందని వివరించారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసుల రెట్టింపు సరాసరి జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని చెప్పారు
కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, బీహార్, ఒడిశా, తమిళనాడు, తదితర రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయన్నారు.
కరోనా కారణంగా కోలుకుంటున్న వారి సంఖ్య , మరణిస్తున్న వారి నిష్పత్తి 80:20గా ఉందని అగర్వాల్ వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే మనం చాలా మెరుగ్గానే ఉన్నామని తెలిపారు.
కాగా, ఇప్పటి వరకు 5 లక్షల యాంటీబాడీ టెస్ట్ కిట్లను రాష్ట్రాలకు అందజేసినట్లు వివరించారు. దేశ వ్యాప్తంగా ప్రత్యేక 1919 కరోనా ఆస్పత్రుల్లో 1.73 లక్షల ఐసోలేషన్ బెడ్లు, 21,800 ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 3,19,400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, గురువారం ఒక్కరోజే 28,340 టెస్టులు నిర్వహించామని వివరించారు. ఇండియాలో కరోనా వైరస్ ప్రభావం ఒక రకంగా తక్కువగానే ఉందని, దేశం నుంచి కరోనాను పూర్తిగా పారద్రోలేందుకు మార్గం సుగమమవుతోందని తెలిపారు.
Comments
Post a Comment