కరోనాకు 2లక్షల వరకు ఆరోగ్యశ్రీ. :ఎమ్మెల్యే రోజా
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని గుర్తించడంలో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పని చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ల్యాబ్స్ పెట్టి కరోనా కట్టడి చేస్తున్నారని.. అలాగే కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేరుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. రూ. 12 వేల నుంచి రూ.2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అన్నారు.
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు తనను గెలిపించిన ప్రజల్ని గాలికి వదిలేశారని రోజా అన్నారు. బాబు ఆంధ్ర నుంచి అమెరికా వరకు సలహాలివ్వడం దురదృష్టకరమని.. చంద్రబాబు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అవసరమేమో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి అవసరం లేదన్నారు. కరోనా వంటి కష్టసమయంలో రాజకీయ విమర్శలు సరికాదన్నారు.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు.
Comments
Post a Comment