దేశంలో 19 వేలకు చేరువైన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 19 వేలకు చేరువైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పటిష్టవంతంగా అమలు చేయడం ద్వారా కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్ననాయి దీనికి ప్రజలు కూడాాా తమ వంతు పూర్తి సహకారాన్ని అందించి తోడ్పాటు అందించాలని ప్రభుత్వాధినేతలు వేడుకుంటున్నారు.
జాతీయం:
► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18, 985కి చేరింది.
► ఇప్పటివరకు దేశంలో 15,122 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
► దేశవ్యాప్తంగా 603 మంది మృతి చెందారు.
► ఇప్పటివరకు 3,259 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ఆంధ్రప్రదేశ్:
► ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 757కి చేరింది.
►చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకొని మొత్తం 96మంది డిశ్చార్జి అయ్యారు.
► వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 639 మంది చికిత్స పొందుతున్నారు.
►రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 22కు చేరింది.
► నేటి నుంచి రేడియోలో టెన్త్ పాఠాలు ప్ర్రారంభం
► నేడు వైద్యుల ‘వెలుగు హెచ్చరిక’ కార్యక్రమం జరగనుంది.
► నేటి నుంచి రైతుబజార్లలో కిలో రూ.20 చొప్పున బత్తాయి విక్రయాలు
తెలంగాణ:
► తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 928కి చేరింది.
► ప్రస్తుతం కరోనా బారినపడి 711 మంది చికిత్సపొందుతున్నారు.
► రాష్ట్రంలో ఇప్పటివరకకు 194 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. 23 మంది మృతిచెందారు.
► నేడు సూర్యాపేట, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో తెలంగాణ సీఎస్, డీజీపీ పర్యటన
అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,36,654కి చేరింది.
► ఇప్పటి వరకు వైరస్ నుంచి 6,77,042 కోలుకున్నారు.
► కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 1,75,759 మంది మృతి చెందారు.
Comments
Post a Comment