దేశంలో 16 వేలు దాటిన కరోనా కేసులు

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను తగ్గించేందుకు పటిష్టవంతంగా లాక్ డౌన్ అమలు చేసేందుకు ప్రభుత్వం ఓవైపు కసరత్తు చేస్తూనే ఆర్థిక రంగం గాడిన పడేందుకు తగిన ఏర్పాట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. దేశ  ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది దీనిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది అలాగే తెలంగాణలో లాక్ డౌన్ మే 7 వరకు కొనసాగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు ఏపీలోనూ రెడ్ జోన్ ఆరంజ్ జోన్లలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తూ బ్లూ జోన్ ఏరియా లో కూడా ప్రజలు సామాజిక దూరం పాటించే విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.


జాతీయం:
►  దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,116 కి చేరింది.
►  దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 519 మంది మృతి చెందారు.
►  దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 2,302 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
►  దేశంలో ప్రస్తుతం 13,295 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
►  నేటి నుంచి పని చేయనున్న లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లు


ఆంధ్రప్రదేశ్‌:
►  ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 647కి చేరింది.
►  కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 67 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
►  ఏపీలో ప్రస్తుతం 565 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.‌


తెలంగాణ:
► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 858కి చేరింది.
► తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 21 మంది మృతి చెందారు.
► తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు.‌
► తెలంగాణలో ప్రస్తుతం 651 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.


అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 210 దేశాలకు విస్తరించింది.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 24 లక్షలు దాటింది.
► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.64 లక్షల మంది మృతి చెందారు.
► ప్రపంచవ్యాప్తంగా 6.24 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా