దేశంలో 15 వేల 700 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా  రోజురోజుకు  కొత్త కరోనా కేసులు పెరిగిపోతూ అందరినీ ఆందళోనకు గురిచేస్తోంది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 15 వేల 700 దాటింది. గత 24 గంటల్లో 1334 మందికి పాజిటివ్‌గా తేలడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 15,712కు చేరింది. దేశంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా 507 మంది మృతి చెందగా..  2,230 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 12,794 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 3,648 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 211 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ (1,893), మధ్యప్రదేశ్‌(1,402), రాజస్తాన్‌ (1,395) రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి.


అమరావతి:


ఆంధ్రప్రదేశ్‌లో కలవర పెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు


647కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య


గడచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదు


*ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ 129 బులిటెన్‌ విడుదల*


కర్నూల్ లో అత్యధికంగా 26 కరోనా పాజిటివ్ కేసులు


అనంతపురం లో 3, విశాఖలో 1, కృష్ణాలో 6, ప గో లో 5, గుంటూరులో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు


రాష్ట్రంలో అత్యధికంగా 158 కరోనా పాజిటివ్ కేసులు


తరువాత స్థానంలో గుంటూరు జిల్లాలో 129


శ్రీకాకుళం, విజయనగరం లో నమోదు కానీ కరోనా పాజిటివ్ కేసులు


పాజిటివ్‌ కేసుల్లో 565 మంది చికిత్స


కరోనా పాజిటివ్ నుండి కోలుకుని 75 మంది డిశ్చార్జి


ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 17 మంది మృతి


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా