ఏపీలో 1332 కు చేరిన కరోనా కేసులు
అమరావతి : ఏపీలో పెరుగుతున్న కరోనా పరీక్షలకు దీటుగా పాజిటివ్ సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు బుధవారం ఉదయం నాటికి ఈ కేసుల సంఖ్య 1332 కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్ను పరీక్షించగా కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1332 చేరింది. ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడి 287 మంది కోలుకున్నారని తెలిపారు. కాగా వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 31 మంది మరణించారని పేర్కొ న్నారు. ప్రస్తుతం 1014 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ వివరించింది.
జిల్లాల వారీగా కరోనా బాధితులు కోరుకున్నవారు మృతుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Comments
Post a Comment