విమానయాన ప్రయాణాలు పూర్తిగా బంద్ ..కేంద్రం కీలక ప్రకటన


కరోనాపై యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 22 నుంచి అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధ విధించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ.. తాజాగా దేశీయ వాణిజ్య విమానాలను కూడా రద్దు చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. రేపు అర్ధరాత్రి లోగా అన్ని దేశీయ విమానాలు ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్ అయ్యేలా షెడ్యూల్ మార్చుకోవాలని ఆయా విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాల వరకు ఈ నిషేధం కొనసాగుతుదని స్పష్టం చేసింది. ఐతే కార్గో (సరుకు రవాణా) విమానాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది కేంద్రం.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా