కరోనా కేసుల్లోనూ అగ్రస్థానానికి చేరిన అమెరికా.. కరోనా వైరస్‌తో ప్రపంచం విలవిల …
అంతులేని నిర్లక్ష్యంతో ఆందోళన చెందుతున్న వైనం… చిన్నా భిన్నమౌతున్న ఆర్ధిక వ్యవస్థ…
(రాజన్ – జనహృదయం ప్రతినిది)
అగ్రరాజ్యంలో కరోనా అగ్రస్థానం ఆక్రమించింది. చైనాలో విజృంభించిన కరోనా వైరస్ కట్టడిలో నిర్లక్ష్యం వహించిన ఇటలీ కరోనా పాజిటివ్ కేసుల్లో ప్రపంచంలో చైనాను మించిపోయిందనుకుంటే నేడు అగ్రరాజ్యమైన అమెరికా 84వేలకుపైగా కేసు నమోదు చేసుకొని అగ్రస్థానానికి చేరడంతో అమెరికా కరోనాతో అతలాకుతం అవుతోంది. చేతు కాలాక ఆకు పట్టుకున్న చందంగా అమెరికా పరిస్థితి తయారైంది. ప్రపంచ దేశాు గజగజలాడిపోతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు.
భారతావనిలో పెరుగుతున్న కరోనా కేసులు…
దేశంలో వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మూడు రోజు క్రితం 530 ఉన్న కరోనా పోజిటివ్ కేసులు 840 కి చేరింది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కఠినంగా లాక్‌డౌన్ అమలు జరుతున్న నేపథ్యంలోనే పరిస్థితి ఈ విదంగా ఉంటే ముందు జాగ్రత్త చేపట్టకుంటే ఎంత ప్రమాదం సంభవించి ఉండేదో? ఈ ప్రమాదాన్ని గుర్తెరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ముందస్తు చర్యు చేపట్టడంతో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించకుంటే పరిస్థితి ఉద్రిక్త కాకతప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 840 కేసులు నమోదు కాగా కేరళలో 176, మహరాష్ట్రలో 147, తెంగాణాలో 59, డిల్లీలో 36, గుజరాత్‌లో 43, ఉత్తర ప్రదేశ్‌లో 41, కర్నాటకలో 55, తమిళనాడులో 35, పంజాబ్‌లో 33, మద్యప్రదేశ్‌లో 20, ఎపిలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెంగాణాలో 59 కి చేరిన కరోనా పోజిటివ్ కేసులు…
తెంగాణాలో పరిస్థితి రోజురోజుకు భయానకమవుతోంది. పోజిటివ్ కేసు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యుద్దప్రాతిపదికన ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమౌతోంది. క్రిటికల్ కేర్ తో పాటు 12400 మందికి ఏకకాంలో వైద్యం అందించేందుకు ఐసోలేషన్ బెడ్స్ సిద్దం చేసింది. వెంటిలేషన్ కోసం 500 యంత్రాను ఏర్పాటు చేశారు. పరిస్థితి చేయిదాటిపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రజ సహకారం, చైతన్యం ప్రధాన భూమిక పోషించనుంది.
ఏపిలోనూ కరోనా కేసుల పెరుగుదల…
ఏపిలో గత రెండు రోజుల్లో కరోనా కేసుల పెరగకపోయినా నెమ్మదిగా రెండకెల స్థాయికి చేరుకొని 13 పాజిటివ్ కేసులతో నిరంతర పోరాటం సాగిస్తోంది. కేసులు ప్రభకుండా ఇక్కడి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకొంటూ అత్యంత జాగ్రత్తు పాటిస్తోంది. దీంతో కరోనా కేసులు ఆందోళన కలిగించకపోయినా రానున్న ఉపద్రవాన్ని ముందే పసిగట్టి యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. ఎట్టి పరిస్థితిలోనే రెండంకెల సంఖ్య దాటకుండా చేసేందుకు ప్రజు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవశ్యకత ఉంది. ప్రజంతా ఎక్కడివారక్కడే ఉంటూ కరోనా గొలుసును నియంత్రించాని ముఖ్యమంత్రి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు, ఆరుగురు మంత్రులు, 10 మంది ఉన్నతాధికారులతో సబ్ కమిటి ఏర్పాటు చేసి కరోనా నియంత్రణకు నడుంబింగించారు. జిల్లాల్లో మంత్రితో పాటు కలెక్టర్ ఆధ్యర్యంలో అధికారులు రెండోవిడత ఇంటింట సర్వే చేపడుతున్నారు.
స్వీయ నియత్రణ పాటించకుంటే పెను ప్రమాదమే…
ప్రపంచాన్ని శాసించే సత్తా కలిగిన అగ్రరాజ్యం అమెరికానే గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఖచ్చితమైన మందు లేనప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చేసేందుకు ప్రభుత్వలు ఎన్ని చర్యలు చేపట్టినా ఎవరికి వారు ప్రాణాంతక వ్యాధి దరిచేరకుండా స్వీయ నియంణ్ర కఠినంగా అమల చేయాల్సిన అవశ్యకతను ప్రతి ఒక్కరూ ఈ భయంకర పరిస్థితిని గుర్తెరిగి ప్రవర్తించకుంటే తమతోపాటు తమ కుటుంబం, సమ సమాజాన్ని కరోనా చేతికి అప్పగించే ప్రమాదం పొంచి ఉంది.
Comments
Post a Comment