ఎనిమిది లక్షలకు చేరుకున్న ప్రపంచ కరోనా బాధితులు... 40 వేలకు చేరువలో మృతులు...
(రాజన్ - జనహృదయం ప్రతినిధి)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని విలవిలలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరుకోగా మృతుల సంఖ్య 40వేలకు అతి చేరువకు చేరుకొంది. అగ్ర రాజ్యం అమెరికాలో ఈ వైరస్ లక్షా 64వేల 359మందికి సోకగా మూడు వేల 670 మంది మృతువాత పడ్డారు. కాగా కరోనా వ్యాధి సోకిన బాధితుల్లో లక్షా 70 వేల మందిని ప్రపంచ వ్యాప్తంగా నయం చేశారు.కరోనా వైరస్ మొదటి కేసు నమోదైన డిసెంబరు 31 నుంచి నేటికి 90 రోజుల్లో ఎనిమిది లక్షల కేసుండగా కేవం గత వారం రోజుల్లో ఈ సంఖ్య నాలుగు లక్షల కరోనా పోజిటివ్ కేసులు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో రానున్న రెండు వారాలు భారత్ లో అతికీలకంగా మారనున్నాయి.
భారత్‌లో కీలకం కానున్న రెండు వారాలు...
భారత్‌లో కరోనా కట్టడికి లాక్‌డౌన్ పటిష్టంగా అము చేయాని కేంధ్రప్రభుత్వం రాష్ట్రాను ఆదేశించింది. రానున్న రెండు వారాు దేశంలో కీలకంగా మారడంతో కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఏప్రిల్ 14నాటికి కరోనా కట్టడికి ప్రజలు సహకారంతో అన్ని కోణాల్లోను అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తికి మూమైన లింక్‌ను అధికార యంత్రాంగం ఛేధించి డిల్లీ మర్కస్ సదస్సు హాజరైన వారందరి వివరాలు సేకరిస్తూ ఎక్కడి వారిని అక్కడే క్వారైంటన్ సెంటర్లకు తరలిస్తూ కరోనా వైరస్వా వారి ద్వారా మరింత సమాచారం సేకరిస్తూ కరోనా లింక్ చేధించేందుకు ప్రభుత్వ యంత్రాంగం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతున్న్నారు. ప్రస్తుతం దేశంలో 14 వంద 30మంది వైరస్ బారిన పడగా 140మంది బాగు పడగా 40 మంది మృతి చెందారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి అలుపెరగని పోరాటం...
ఎపిలో వైరస్ బాధితు సంఖ్య 40కి చేరగా ఇద్దరు కరోనా నుండి కోలుకున్నారు. తెంగాణాలో 77 కేసులు నమోదు కాగా 130 మంది కోలుకోగా ఆరు మంది మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వాు వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రాథమిక స్థాయి నుంచి అన్ని కోణాల్లోనూ కట్టడికి ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపధ్యంలో ఏ ఒక్కరూ ఆకలి బారిన పడకుండా చర్యు చేపట్టారు. నిత్యావసర సరకు రవాణా మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం ఆకలి బాదలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితలు సంభవిస్తే చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు వారాలు ప్రజంతా ఇంటికే పరిమితమై కరోనా వ్యాప్తిని అరికట్టాలని కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. అధికారులెంత పకడ్భందీగా చర్యలు చేపట్టినా ప్రజలు లాక్‌డౌన్ పట్ల అశ్రద్ద వహిస్తే భద్రతా చర్యలు ఏ ఒక్కరి వలనైనా విఫలమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Comments
Post a Comment