నేటి అర్థరాత్రి నుంచి ఏప్రిల్‌ 21 వరకు భారత్‌ లాక్‌డౌన్‌ (కర్ఫ్యూ) : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు



కరోనా కట్టడికి వేరే దారిలేదు... సామాజిక దూరం పాటించాల్సిందే : ప్రధాని నరేంద్ర మోదీ


చేతులు జోడిరచి వేడుకొంటున్నా... కరోనా ఎదుట సామాన్యుడైనా? ప్రధాని అయినా ఒక్కటే... యావత్‌ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని దరిచేరకుండా చేసేందుకు సామాజిక దూరం ఒక్కటే మార్గం.. దీనికోసం యావత్‌ భారతావని ఈ అర్ధరాత్రి నుంచి ఏప్రిల్‌ 21వరకు లాక్‌డౌన్‌ పాటించాంటూ దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రాధేయపడుతూ ప్రజను వేడుకొన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి ఇటువంటి పరిస్థితి ఎదురుపడినప్పటికీ ఈ మహమ్మారిని జయించేందుకు మరో మార్గం లేదంటూ కేవం సామాజిక దూరం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మానవాళి మనుగడ సాగాంటే ప్రతి ఒక్కరూ తమ చుట్టూ క్షణరేఖ గీసుకొని గీత దాటకుండా ఉంటే తప్ప కరోనా జయించలేమంటూ ప్రధాని స్పష్టం చేశారు. లాక్‌ డౌన్‌ అంటే కర్ఫ్యూలాంటిదేనని దీనిని భారతీయుంతా అర్ధం చేసుకోవాల్సిందిగా మోదీ విజ్ఞప్తి చేశారు. పరిస్థితి చేయిదాటక ముందే కఠినమైన నిర్ణయాు తీసుకోకుంటే కరోనా మహమ్మారి వియతాండవం చేసి మరణ మృదగం మోగిస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రజు అనుకుంటే ఖచ్చితంగా కరోనాను జయించగమని ఆదివారం నాటి జనతా ఖర్ప్యూతో రుజువైందన్నారు.


ప్రతి ఒక్కరు తనకోసం, భార్యా ప్లిు, తల్లిదండ్రు, బందుమిత్రు, సమాజం శ్రేయస్సుకోసం తమ గృహా చుట్టూ స్వచ్చందంగా క్షణరేఖ గీసుకోవాని సూచించారు. వేరే దారి లేదు పెను ప్రమాదం పొంచి ఉంది.. ప్రజారోగ్యం కాపాడేందుకే ఇంతటి నిర్భంద వాతావరణం ప్రతి ఒక్కరూ తమకు తాము వ్యాధి నివారణకు నడుంబిగించాని ప్రధాని మోదీ పిుపునిచ్చారు.


మంగళవారం అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అంటే ఖర్ఫ్యూ కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ సహకరించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాని ప్రధాని పిుపునిచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అధికార యత్రాంగం లాక్‌డౌన్‌ను కఠినంగా అముచేయాని ఆదేశించారు.


దేశంలోని అన్ని రాష్ట్రాల తొలి ప్రాధాన్యం వైద్యమే కావాలని కోరామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వైద్య సదుపాయాల్ని మెరుగుపర్చుకునేందుకు రూ.15 వేల కోట్ల నిధులు సమకూరుస్తున్నామనా ఆయన అన్నారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయని కొనియాడారు.
కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే..ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని ఆయన అన్నారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా విజయం సాధిస్తామని మోదీ అన్నారు.



Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా