ఆరు లక్షలు 14 వేలు దాటిపోయిన కరోనా పోజిటవ్‌ కేసులు.. 30 వేలకు చేరువలో మృతుల సంఖ్య..


(జనహృదయం ప్రతినిధి)
ప్రపంచ వ్యాప్తంగా 199 దేశాల్లో ఆరులక్షలు పైగా కరోనా కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 30వేలకు (27వేల417) చేరువవుతోంది. కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలం అవుతోంది. ప్రపంచంలోకెల్లా అగ్రరాజ్యంగా నిలిచిన అమెరికాలో నేడు లక్షకు పైగా కరోనా పోజిటివ్‌ కేసులు నమోదు చేసుకొంది. అక్కడి మృతుల సంఖ్య 1300 దాటిపోయింది. కాగా ఇటలీ కరోనా పాజిటివ్‌ కేసుల్లో 82వేల లోపు నమోదుకాగా మృతుల సంఖ్య 9 వేలు దాటిపోయింది. కరోనా కట్టడికి అమెరికా శత్రుదేశమైన చైనా సాయంకోరుతోంది. తీవ్ర మైన నిర్లక్ష్యం కారణంగా అమెరికా అత్యంత దారుణ పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ రెండు దేశాలు కరోనా వైరస్‌ పట్ల అవలంభించిన నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇంతటి ఘోర విపత్కర పరిస్థితికి చేరిందని చెప్పక తప్పదు.


స్వీయ నియంత్రణతో ప్రపంచ విజేతగా నిలిచిన వియత్నాం...


చైనా ప్రక్కనే ఉన్న వియత్నాం ప్రభుత్వం చేపట్టిన కఠిన మైన నిర్ణయాలు దేశంలో ఒక్క మరణం కూడా లేకుండా జాగ్రత్త పడ్డారంటే వారు కరోనా కట్టడికి ఈ ఏడాది ప్రారంభం (జనవరి ఒకటి) నుండి లాక్‌డౌన్‌ పాటించి పొరుగు దేశాల రాకపోకలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు.   చిన్న దేశం అందునా వైద్య పరంగా వెనుకబడిన వియత్నాం కరోనా కట్టడిలో అగ్రరాజ్యానికి సైతం ధీటుగా నిలిచిందంటే అక్కడి ప్రజు పాటించిన స్వీయ నియంత్రణే ప్రధాన కరోనా నివరణ చర్యగా కనిపిస్తోంది. స్వీయ నియంత్రణ కరోనా వ్యాప్తిని ఏమేరకు అరికడుతుందో ప్రపంచ దేశాలకు వియత్నాం ఆదర్శంగా నిలిచింది.  ప్రపంచ వ్యాప్తంగా 199 దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాని అనుకొని ఉన్న వియత్నాంలో కనీసం ఒక్క మరణాన్ని కూడా నమోదు చేయలేకపోయిందంటే స్వీయ నియంత్రణ ప్రాధాన్యం ప్రతి ఒక్కరూ గుర్తించాల్ని అవశ్యకత ఉంది.


భారత దేశంలో 21కి చేరిన కరోనా మరణాలు...
లాక్‌డౌన్‌ ప్రకటించి ఆరు రోజులు పూర్తవగా కరోనా మృతు 21కి చేరుకున్నాయి. పాజిటివ్‌ కేసులు 873గా నమోదయ్యాయి. దీంతో కేంద్రం మరో అడుగు ముందుకేసి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో కేంధ్రమంత్రిని నియమించి కరోనా కట్టడికి కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సత్వర చర్యకు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంధ్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ను నిమమిస్తూ ప్రధానమంత్రి ఉత్తర్వు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఐసొలేషన్‌ వార్డులుగా ఉపయోగించేందుకు రైల్వే బోగీలను సిద్దం చేస్తోంది. అలాగే క్వారంటీన్‌ సెంటర్లుగా ఉపయోగించేందుకు కేంద్రీయ విద్యాయాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికుల తమ సొంత ఉళ్లకు వెళ్లకుండా ఎక్కడి వారు అక్కడే ఉండే విదంగా చర్యలు చేపడుతోంది. వారికి సంబందించి వసతి, బోజన సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.



హౌస్ అరెస్ట్ తో విజయం సాదిద్దాం....


భారతావనిలో ప్ర్రతి ఒక్కరూ ఎవరి ఇంటికి వారే పరిమితమై స్వీయ నియంత్రణ పాటించేందుకు హౌస్ అరెస్ట్ మాదిరిగా ప్రతినబూనాల్సిన అవసరాన్ని గుర్తించాలి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేపట్టినా ప్రజలు ఎవరికీ వారు స్వీయ నియంత్రణ పాటించకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సిన ప్రమాదం పొంచి ఉంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా