ఎనిమిది లక్షలకు చేరుకున్న ప్రపంచ కరోనా బాధితులు... 40 వేలకు చేరువలో మృతులు...
(రాజన్ - జనహృదయం ప్రతినిధి) కరోనా మహమ్మారి ప్రపంచాన్ని విలవిలలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరుకోగా మృతుల సంఖ్య 40వేలకు అతి చేరువకు చేరుకొంది. అగ్ర రాజ్యం అమెరికాలో ఈ వైరస్ లక్షా 64వేల 359మందికి సోకగా మూడు వేల 670 మంది మృతువాత పడ్డారు. కాగా కరోనా వ్యాధి సోకిన బాధితుల్లో లక్షా 70 వేల మందిని ప్రపంచ వ్యాప్తంగా నయం చేశారు.కరోనా వైరస్ మొదటి కేసు నమోదైన డిసెంబరు 31 నుంచి నేటికి 90 రోజుల్లో ఎనిమిది లక్షల కేసుండగా కేవం గత వారం రోజుల్లో ఈ సంఖ్య నాలుగు లక్షల కరోనా పోజిటివ్ కేసులు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో రానున్న రెండు వారాలు భారత్ లో అతికీలకంగా మారనున్నాయి. భారత్‌లో కీలకం కానున్న రెండు వారాలు... భారత్‌లో కరోనా కట్టడికి లాక్‌డౌన్ పటిష్టంగా అము చేయాని కేంధ్రప్రభుత్వం రాష్ట్రాను ఆదేశించింది. రానున్న రెండు వారాు దేశంలో కీలకంగా మారడంతో కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఏప్రిల్ 14నాటికి కరోనా కట్టడికి ప్రజలు సహకారంతో అన్ని కోణాల్లోను అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా ...