ఢిల్లీలో హ్యాట్రిక్ దిశగా కేజ్రీవాల్ ...
ఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ అంచనావేసినట్టుగానే ఢిల్లీ పీఠం దక్కించుకొని అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ సాధించేదిశగా సాగుతున్నారు. అందరూ ఊహించిన విదంగానే ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసుకుపోతూ హ్యాట్రిక్ విజయానికి చేరువయింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 50కు పైగా స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ మంత్రులు కూడా ఆయా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కేజ్రీవాల్ ఇంటి ముందు అభిమానుల సందడి మొదలయ్యింది. మరోవైపు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆప్ కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ బాణా సంచా కాలుస్తూ వారు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కాకూడదన్న బీజేపీ ఆశలు అడియాశలే అయ్యాయి. బీజేపీ ఆప్‌కు అందనంత దూరంలో నిలిచింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే కాస్తంత మెరుగుపడడం ఒక్కటే బీజేపీకి కాస్త ఊరట కలిగించే విషయం. 2015లో ఆప్ ఏకపక్ష విజయం సాధించగా ఈ సారి మాత్రం బీజేపీ ఆ పార్టీకి గట్టి పోటీనిచ్చింది. కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంలో ఆధిక్యంలో సాగుతోంది.
Comments
Post a Comment