మావోయిస్టు ఏరియా కమిటి సభ్యుడు లొంగుబాటు
ఒరిస్సా (జనహృదయం ) : ఉద్యమంపై విసుగుచెంది ఓ మావోయిస్టు ఏరియా కమిటీ నెంబర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు 2018 సెప్టెంబర్ 24న విశాఖ జిల్లా డుంబ్రిగుడ ప్రాంతంలో అప్పటి తాజా మాజీ శాసన సభ్యులు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ (అరకు మాజీ ఎమ్మెల్యేలు) హత్యా సంఘటనలో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు నేత జిప్రో హబిక బుధవారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మల్కాన్ గిరి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు మావోయిస్టు పార్టీ తోను, తుపాకితోను రాజ్యాధికారం రాదని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తోనే ఆదివాసీలు అభివృద్ధి చెందుతారని నమ్మిన మావోయిస్టు ఏసీమ్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు వివరించాడు. ఇటీవల పెరిగిన పోలీస్ కూమబింగ్, ఆదివాసీల తిరుగుబాటు పార్టీలో ఆదివాసీల పట్ల నిర్లక్ష్య ధోరణి తదితర అంశాలు తనను లోగిపోయే విదంగా ప్రేరేపించాయని జిప్రో పేర్కొన్నాడు. కాగా లొంగిపోయిన మావోయిస్టు నేత ఒరిస్సా పోలీసులు స్వాగతం పలికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అనుమతి ఇచ్చారు.
Comments
Post a Comment