గుజరాత్ లో దారుణం అత్యాచారం.. ఆపై చంపి చెట్టుకు వీలదీశారు...


 గుజరాత్ : మానవ మృగాలు నుంచి రక్షించేందుకు ఎన్ని చట్టాలోచ్చినా మార్పు రావడంలేదు.  దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించిన  నిర్భయ దిశ ఘటనలకంటే  దారుణమైన ఘటన గుజరాత్ లో వెలుగుచూసింది. సభ్యసమాజాన్నే కలవరపెట్టింది.గుజరాత్ లో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ఆమెను చంపేసి మర్రి చెట్టుకు వేలాడదీసిన వైనం కలకలం రేపింది.ఈ ఘటన తెలిసిన వెంటనే స్థానికుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ 'జస్టిస్ ఫర్ కాజల్' పేరుతో హ్యాష్ ట్యాగ్ దేశమంతా వైరల్ అయ్యింది. బాధిత యువతిని నలుగురు రేప్ చేసి చంపేసి చెట్టుకు వేలాడదీశారని వైద్యుల పోస్టుమార్టంలో తేలింది.


డిసెంబర్ 31 నుంచి బాధిత యువతి కనిపించడం లేదు. అంతా వెతికిన తల్లిదండ్రులు 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు.   యువతి ప్రియుడితో వెళ్లి పోయిందని.. ప్రచారం జరిగింది. తాజాగా యువతి చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేసి చంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాధితులు ఆరోపించిన నలుగురు నిందితులు బిమల్ దర్శన్ సతీష్ జిగర్ అనే నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు. కాగా 'జస్టిస్ ఫర్ . కాజల్ నిందితులకు మరణ శిక్ష విదించాలన్న డిమాండ్ సర్వత్రా ఉప్పెనలా వెల్లువెత్తుతోంది. 


 


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా