ఎపిలో కొలువుల జాతర ...
అమరావతి: ఎపిలో మళ్ళీ కొలువుల జాతరకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీ కోసం పంచాయతీరాజ్, పురపాలక శాఖ వేర్వేరుగా శుక్రవారం ప్రకటనలు జారీ చేశాయి. గ్రామ సచివాలయాల్లో 13 రకాలైన 14,061 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పశుసంవర్ధక శాఖకు చెందిన పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందున విద్యార్హతను తగ్గించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం అధికారులు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి అనుమతించాక ఆ శాఖలో ఖాళీల భర్తీ కోసం వేరుగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. వార్డు సచివాలయాల్లో ఆరు రకాలైన 2,146 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నేటి నుంచి 31లోగా అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Post a Comment