సంక్రాంతికిప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌ : సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని వివిధ మార్గాల్లో ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ సువిధ ప్రత్యేక రైలు (నెంబర్‌: 82725) సికింద్రాబాద్‌ నుంచి జనవరి 10వ తేదీ సాయంత్రం 6గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.30గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ (రైల్‌నెం:07256) సికింద్రాబాద్‌ నుంచి జనవరి 12, 13వ తేదీల్లో రాత్రి 7.25గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.  సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ సువిధ ప్రత్యేక రైలు(నెంబర్‌:82731) సికింద్రాబాద్‌ నుంచి జనవరి 11వ తేదీ రాత్రి 7.25 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.  నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌:07255) నర్సాపూర్‌ నుంచి జనవరి 18వ తేదీ సాయంత్రం 6గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.  నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ సువిధ స్పెషల్‌ (రైల్‌నెంబర్‌: 82727 (నర్సాపూర్‌ నుంచి జనవరి 19వ తేదీ రాత్రి 8గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.50గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా